పీవోకే ప్రజలు మనవాళ్లే:రాజ్‌నాథ్‌

9
- Advertisement -

పీవోకే ప్రజలు మనవాళ్లేనని తేల్చిచెప్పారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళికంగా విడిపోయినా రాజకీయంగా ఏదో ఒకరోజు పీవోకే.. భారత్‌లో ఏకమవడం ఖాయమని తెలిపారు. పీఓకే ప్రజలకు భారత్‌తో దృఢమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఇప్పుడు శిక్ష అనుభవిస్తుందని తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మనవారు, మన కుటుంబంలోని సభ్యులే అని నాకు నమ్మకం ఉంది అన్నారు.

ఏప్రిల్ 22న పహల్‌గాం ఘటనలో 26 మంది పౌరులు మరణించిన అనంతరం, భారత్ మే 7న పాక్ మరియు PoKలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణపై ఒక ఒప్పందానికి వచ్చాయి.

Also Read:ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..

- Advertisement -