పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధ్ ప్రాంతం తిరిగి భారత్ లో కలవొచ్చని రక్షణ మంత్రి తెలిపారు. సరిహద్దులు శాశ్వతం కాదని, నాగరికత పరంగా సింథ్ భారత్‌దేనని వ్యాఖ్యనించారు.
దేశ విభజనను సింధీలు మానసికంగా అంగీకరించలేదన్న అద్వానీ మాటలను ప్రస్తావనకు తెచ్చారు. సింధ్ తో భారత్ కు విడదీయరాని నాగరికత, సాంస్కృతిక సంబధాలున్నాయి అన్నారు రాజ్‌నాథ్ సింగ్.
సింధీ సమాజ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్… సింధ్ నేడు పాకిస్తాన్‌లో భాగమైనప్పటికీ, ఆ ప్రాంతం భారత దేశంతో ఉన్న నాగరికత-సాంస్కృతిక బంధాలు శాశ్వతమని, భవిష్యత్తులో ఆ స్థితి మారే అవకాశం ఉందని తెలిపారు. రాజకీయ సరిహద్దులు కాలక్రమంలో మారవచ్చని, కానీ సాంస్కృతిక వారసత్వం, నాగరికతల బంధాలు భౌగోళిక రేఖల కంటే శాశ్వతమని ఆయన పేర్కొన్నారు.
భూమి విషయానికి వస్తే సరిహద్దులు మారుతాయి. ఎవరికీ తెలియదు, రేపటి రోజు సింధ్ మళ్లీ భారత్‌కు చేరొచ్చు. మన సింధీ ప్రజలు – సింధు జలాన్ని పవిత్రంగా భావించే వారు – ఎక్కడున్నా వారు మనవారే. వారు ఎల్లప్పుడూ మనవారే అన్నారు.
Also Read:బీహార్‌లో ఎన్డీఏకు మద్దతు:ఓవైసీ

