పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ పద్ధతిలోనైనా అణిచివేస్తాం అని తెలిపారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులకే కాదు, వాళ్లను పెంచి పోషించే వాళ్లకు కూడా స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు తెలిపారు.
మనం ఎంతో శక్తివంతమైన దాడి చేశామని, ఆ దాడుల్ని విరమించుకునేలా చేయాలని పాకిస్థాన్ ప్రపంచ దేశాలను వేడుకుందన్నారు. మన సైనిక దళాలు ఎంతో వేగంగా, గాఢాంగా, స్పష్టమైన దాడులు చేశాయని, అసాధారణ రీతిలో ఆ దాడులు జరిగినట్లు చెప్పారు.
పాక్ ఉగ్రవాదులను నాశనం చేసేందుకు ఏ పద్ధతినైనా అనుసరిస్తామని, పాక్ ఊహించలేని పద్ధతుల్లో ఆ చర్యలు ఉంటాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పాకిస్థాన్ ఆడుతున్న ప్రమాదకర ఉగ్రవాద ఆట ఇప్పుడు ముగిసిందన్నారు. సమగ్రమైన రీతిలో సాగిన ఆపరేషన్‌లో భారతీయ నౌకాదళ పాత్ర కూడా అద్భుతమైందని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు అని, ఉగ్రవాదంపై అది మూకుమ్మడి దాడి అని రాజ్‌నాథ్ చెప్పారు.
Also Read:చంద్రబాబుపై జగదీష్ రెడ్డి ఫైర్

