రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు…సొంతం చేసుకోండి!

160
rajiv
- Advertisement -

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం పరిధిలో నిర్మించిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటినుండి మొదలుకానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా నేటి నుండి జూన్ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అర్హత కలిగిన వాళ్లకు మీ సేవ పోర్టల్‌, కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. స్వగృహ తెలంగాణ వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 22న లాటరీ ద్వారా ఫ్లాట్ల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.1,000గా నిర్ణయించారు. ఫ్లాట్ల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతి పాటిస్తారు.

బండ్లగూడలో 419 ఫ్లాట్లు పూర్తిగా సిద్ధంకాగా మరో 1,082 ఫ్లాట్లలో పనులు కొనసాగుతున్నాయి. పూర్తిగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.3 వేలుగా, పాక్షికంగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,750గా నిర్ణయించింది. పోచారంలో 1,328 ఫ్లాట్లు పూర్తి స్థాయిలో సిద్ధం కాగా మరో 142 ఫ్లాట్లలో స్వల్పంగా పనులు మిగిలి ఉన్నాయి.పూర్తయిన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,500గా, పాక్షికంగా సిద్ధమైన ఫ్లాట్ల ధరను చదరపు అడుగుకు రూ.2,250గా నిర్ణయించారు.

- Advertisement -