Rajiv Gandhi:​సంస్కరణల సృష్టికర్త

54
- Advertisement -

దేశ రాజకీయాల్లో చెరగని పేరు ఆయనది. సంస్కరణల సృష్టికర్త. దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చిన మహానేత. ఎన్నో అభివృద్ధి ఫలాలు, అంతకుమించి విమర్శలు.20 ఆగస్టు 1944లో ఫిరోజ్ గాంధీ – ఇందిరా గాంధీ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు. భార్య సోనియా గాంధీ. పిల్లలు: రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రా.గాంధీ కుటుంబం నుండి మూడో ప్రధానిగా ఎన్నికయ్యారు.

40 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి. జాతీయ విద్యా విధానం యొక్క సమగ్ర మార్పు మరియు టెలికాం రంగం విస్తరణకు కృషి చేశారు. అయితే బోఫోర్స్ కుంభకోణం,శ్రీలంకలో LTTEని అరికట్టడానికి అతని దూకుడు ప్రయత్నాలు, 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు దారితీశాయి.మరణాణంతరం 1991లో భారతదేశ అత్యున్నతన పౌర పురస్కరం భారతరత్నను అందుకున్నారు.

Also Read:అంతర్జాతీయ టీ దినోత్సవం..

రాజీవ్ గాంధీ అవలంబించిన ఆర్థిక విధానాలు 1991లో ఆర్థిక వ్యవస్థ యొక్క మరింత విస్తృతమైన సరళీకరణ ప్రయత్నాలకు మార్గం సుగమం చేశాయి. టెలికమ్యూనికేషన్,రక్షణ మరియు వాణిజ్య విమానయాన సంస్థలకు సంబంధించిన దిగుమతి విధానాలను సంస్కరించారు రాజీవ్. వివిధ రంగాలలో సమకాలీన సాంకేతిక పురోగతులను ప్రవేశ పెట్టారు.

Also Read:IPL 2023:ముంబై, ఆర్సీబీ.. ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి ?

దేశంలో పలు సంస్కరణలకు కారణమైన రాజీవ్‌పై అంతేస్ధాయిలో విమర్శలు వచ్చాయి. బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ జీవితంలో పెద్ద మచ్చ. మే 21, 1991న రాజీవ్ కిరాతకంగా చంపబడ్డారు.

- Advertisement -