రజినీ కొత్త సినిమాకు పేరు ‘పేట్టా’రు..

234
Petta Movie

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 165 సినిమా మొదలుకాబోతున్న విషయం విదీతమే. ఈ మూవీకి కార్తిక్‌ సుబ్బరాజు తెరకెక్కించనున్నాడు. ఇందులో త్రిష రజినీ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా విజయ్‌ సేతుపతి, సిమ్రన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా సంబంధించి తమిళ టైటిల్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.

ఈ మూవీకి ‘పేట్టా’ అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో రజినీ చాలా స్టైలిష్, మాస్‌గా కనిపించారు. ఆయన లుక్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. దీంతో ఫ్యాన్స్‌ ట్విటర్‌లో తెగ లైక్‌లు, షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క రజినీ నటించిన ‘2.ఓ’ సినిమా టీజర్‌ను సెప్టెంబరు 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Petta - Official Motion Poster | Superstar Rajinikanth | Sun Pictures | Karthik Subbaraj