సుపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు బాషా సినిమాతో సంచలనం సృష్టించాడు.’బాషా ఒక్క సారి చెప్పితే వంద సార్లు చేప్పినట్టు’ అంటు రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ ఇప్పటికి జనాల హృదయాల్లో మారు మోగుతున్నాయి. 22 ఏళ్ల క్రితం ఈ సినిమా ఎన్నో సెన్సేషన్ సృష్టించిది. ఈమూవీతో తెలుగు కుడా రజినీ స్టార్ హీరో అయ్యాడు.దర్శకుడు సురేష్ కృష్ణ రజినితో మాఫియా డాన్ స్టోరీని తెరక్కెకించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ మూవీ లో ప్రదానంగా స్ర్కీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి.దర్శకుడు సురేష్ కృష్ణ ఈ మూవీతో ఫ్లాష్ బ్యాక్‌కి ముందు ఫ్లాష్ బ్యాక్ తర్వత అనే కాన్సేప్ట్‌తో రజినీని డిఫరెంట్‌గా చూపించాడు. సెన్సేషనల్ ఫ్లాష్ బ్యాక్ తీమ్‌తో సంచలనం క్రీయేట్ చేశాడు దర్శకుడు సురేష్ కృష్ణ .ఇప్పటి వరకు అదే తరహ ఫ్లాష్ బ్యాక్ స్ర్కీన్ ప్లే తో ఎన్నో సినిమాలు తెరక్కెకాయి.ఫ్లాష్ బ్యాక్ తీమ్ కాన్సెప్ట్ ఈ సినిమాతో స్టార్ట్ అంయిది. మరి ఇప్పుడు బాషా మూవీ డిజిటల్ వెర్షన్‌లో 5.1 సరౌండ్ సౌండ్‌తో మళ్ళీ విడుదల చేస్తున్నరు.అప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది.మరి అప్పుడే బిగెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా డిజిటల్ వెర్షన్ లోను అంతే విజయం సాధిస్తుందని నిర్మతలు భావిస్తున్నారు
ఈ డిజిటల్ వెర్షన్ మూవీని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో మార్చ్ 3న వరకు వేచి చూడాలి మరి. డిజిటల్ బాషా తమిళ్ వెర్షన్ ను మార్చ్ 3న రిలజ్ చేయబోతున్నట్లు సత్య మూవీస్ అనౌన్స్ చేసింది. ఒకే సినిమాతో ఒకే తరహా మాయను మళ్లీ రిపీట్ చేయడం కష్టమే కానీ.. బాషా లవర్స్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఈ డిజిటల్ బాషాకు మంచి సపోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.