వర్మ వర్సెస్ పవన్… మార్షల్ ఆర్ట్స్

151
pawan kalyan vs Ramgopal varma
- Advertisement -

గతంలో పవన్‌, ఆయన అభిమానులపై తనదైన శైలీలో ట్విట్ల వర్షం కురిపించిన వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు. ఈసారి పవన్‌పై విమర్శల ట్విట్లు కాకుండా పవన్‌ ఫోటోని షేర్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఫోటోతో టీ టౌన్‌లో సరికొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. త్వరలో వర్మతో కలిసి పవన్‌ సినిమా తెరకెక్కించబోతున్నాడని అందుకు సంకేతంగానే వర్మ …పవన్‌ మార్షల్ ఆర్ట్స్‌ ఫోటోని షేర్ చేశాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

రామ్ గోపాల్ వర్మ కాలేజీ రోజుల్లో, పవన్‌ కుర్రాడిగా ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. పవన్‌కి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. తన సినిమాల్లో ఎన్నోసార్లు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాల్ని కూడా ప్రదర్శించారు పవన్. అంతా బాగానే ఉంది కానీ సైలెంట్ గా పవన్ ఊసెత్తకుండా గడుపుతున్న వర్మ..హఠాత్తుగా ఇప్పుడు పవన్ ఫొటోలను ఎందుకు పోస్ట్ చేసినట్లు అనేది ఎవరికీ అర్దం కాలేదు.

అయితే, ఇది తాను పవన్‌తో సినిమా చేయడానికి అని సంకేతాలిస్తున్నటా లేదా మళ్లీ పవన్ కి సంభందించిన ట్వీట్ల సీరిస్ మొదలెడతారా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. లేదా పవన్ లాగే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను అని చెప్పటం ఆయన ఉద్దేశ్యమా అనేది తెలియరాలేదు.

- Advertisement -