జమిలి ఎన్నికలపై..త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయనున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొన్న రజనీ.. జమిలి ఎన్నికలకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన, మంచి ఆలోచన అని అన్నారు. ఈ జమిలి ఎన్నికల వలన డబ్బుతో పాటు, సమయం ఆదా అవుతాయని, అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.
లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ జమిలి ఎన్నికల వలన సమయంతో పాటు, డబ్బు వృద్దా కావని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఈ విషయంపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల కమిషన్ ఢిల్లీలో సమావేశం రెండు రోజులు నిర్వహించింది. టీఆర్ఎస్, అన్నాడీఎంకేలతో పాటు పలు పార్టీలు మద్దతు తెలిపాయి.
2019 ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలు అంటే మాత్రం తాము వ్యతిరేకిస్తామని ఏపీ అధికార పార్టీ టీడీపీ తమ అభిప్రాయాన్ని తెలియజేయగా… ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ జమిలి ఎన్నికలకు జై కొట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పేసింది. జమిలి ఎన్నికలు రాజ్యంగ విరుద్దమని పేర్కొంది. మొత్తానికి కొన్ని పార్టీలు మద్దతు తెలిపగా.. మరికొన్ని పార్టీ వ్యతిరేకించాయి.