తమిళ రాజకీయాలపై రజనీ సంచలన వ్యాఖ్యలు..

616
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆశ్చర్యకర పరిణామాలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చన్న రజనీకాంత్.. ఇందుకు తమిళనాడు రాజకీయాలే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏళ్ల తరబడి కలలు కనాల్సిన పనిలేదని అన్నారు.

ముఖ్యమంత్రిని కావాలని పళనిస్వామి ఏనాడైనా కలలు కన్నారా? అని ప్రశ్నించారు. ఎడపాడి ప్రభుత్వం రోజుల్లోనో నెలల్లోనో కూలిపోగలదని అందరూ ఆంచనావేయగా సుస్థిరమైన ప్రభుత్వంలో ఏళ్లతరబడి కొనసాగుతున్నారు. అలాగే, రేపు మరెవరైనా సీఎం కావొచ్చని అన్నారు. ప్రస్తుతం రజనీ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

rajinikanth-political

2017లోనే రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పార్టీ పెట్టడంపైనా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇటీవల బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ ఊహాగానాలను రజనీ ఖండించారు.

తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. తన గురించి తాను చేసుకున్నవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయశూన్యతను తాను భర్తీ చేస్తానని రజనీకాంత్‌ ఇటీవల చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.

Actor-turned-politician Rajinikanth on Sunday took a jibe at Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami by saying miracles continue to happen.

- Advertisement -