తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. రజనీ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి 108కి ఫోన్ చేయడంతో ఒక్కసారిగా అంతా ఆందోళనకు గురయ్యారు.
చెన్నై పోయిస్ గార్డెన్ ప్రాంతంలోని రజినీకాంత్ ఇంట్లో బాంబు పెట్టారని సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు … బాంబు స్వ్కాడ్‌తో రజనీ ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
అయితే కరోనా కారణంగా పోలీసులను ఇంట్లోకి అనుమతివ్వకపోవడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లో సోదా చేసిన పోలీసులు అది ఫేక్ కాల్‌గా తేల్చారు. ఫోన్‌కాల్ ఎక్కడినుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని …ఆ అఘాంతకుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
రజనీ రీసెంట్ గా నటించిన దర్బార్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోళ్తా పడింది. బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టిన ఈ మూవీ రజనీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది.