లీకైన ‘కాలా’ టాటూ..సోషల్‌ మీడియాలో వైరల్‌.!

267
Rajinikanth: Rajinikanth sports a tattoo in Kaala
- Advertisement -

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 161వ చిత్రం ‘కాలా’. ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘కబాలి’ తర్వాత మరోసారి యువ దర్శకుడు పా రంజిత్ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కాలా మూవీకి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

లీకైన ఈ వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఈ స్టిల్స్‌లో సూపర్ స్టార్ కుడి చేతిపై ఏదో ఓ టాటూ వున్నట్టుగా కనిపించడమే.
   Rajinikanth: Rajinikanth sports a tattoo in Kaala
‘S’ అనే అక్షరంతో వున్న ఈ టాటూ వెనుక వున్న మర్మం ఏంటా అనేదే ఇప్పుడు రజినీ ఫ్యాన్స్‌లో ఓ ఆసక్తికరమైన చర్చగా మారింది. బహుషా సినిమాలో అది తన భార్య కానీ లేదా పిల్లల పేరులో మొదలయ్యే మొదటి అక్షరం అయ్యుంటుందని కొందరు.. కాదని ఇంకొందరు ఎవరికి తోచినట్టుగా వారు చర్చించుకుంటున్నారు.

సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా కావడంతో అతడి ప్రతీ కదలికా ఓ వార్తే అవుతుందనడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టాటూ ఫోటోలే ఓ ఉదాహరణ.
  Rajinikanth: Rajinikanth sports a tattoo in Kaala
సూపర్ స్టార్ సరసన హుమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అంజలి పాటిల్ ఇతర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ ని జరుపుకుంటోంది ఈ సినిమా. ఇక ఈ సినిమాని 2018లో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -