కమల్‌తో తలైవా రహస్య భేటీ…

76
Kamal Haasan meets Rajinikanth

రజనీ కాంత్, కమల్ హాసన్ ఇద్దరూ తమిళ సినీ పరిశ్రమలో సమాన స్థాయి కలిగిన స్టార్ హీరోలు. తన మార్క్ యాక్టింగ్, స్టైల్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థాన్ని తెచ్చిన వ్యక్తిగా రజనీని చెప్పుకుంటే, విభిన్న సినిమాలతో సరికొత్త కథాంశాలతో తెరకెక్కే సినిమాల నటుడిగా కమల్ హాసన్ గురించి చెప్పుకుంటాం. వీరిద్దరికీ బాల చందరే గురువు. ఇక వీరిద్దరూ కలిసి గతంలో చాలా సినిమాలకే పనిచేశారు. వీరిద్దరు ఈ మధ్య కాలంలో కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ.

ఈ నేపథ్యంలో రజనీకాంత్, కమల్ హాసన్‌లు సోమవారం సాయంత్రం రహస్యంగా భేటీ అయ్యారు. చెన్నై అల్వార్‌పేటలోని కమల్ కార్యాలయానికి వచ్చిన రజనీ చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఈ నటులు ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ప్రస్తుతం రజనీ రోబో సీక్వెల్‌లో నటిస్తుండగా, శభాష్ నాయుడు చిత్రీకరణలో కమల్ గాయపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిద్దరి భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.