సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న సిమ్రాన్..

404
simran
- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కాలా సినిమాతో భారీ విజ‌యాన్ని సంపాదించుకున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకున్నాడు ర‌జ‌నీ. ఇక ర‌జ‌నీ ప్ర‌స్తుతం కార్తిక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈమూవీలో ర‌జ‌నీకాంత్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపించ‌నున్నాడు. దింతో ర‌జ‌నీ కొత్త లుక్ పై అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

rajinikanth simran

ఇక ఇన్ని రోజులు ఈసినిమాలో ర‌జ‌నీ స‌ర‌స‌న హీరోయిన్ గా ఎవ‌ర్ని తీసుకుంటార‌ని ఆలోచ‌న‌లో ఉన్నారు అభిమానులు. ఇక తాజాగా ఉన్న స‌మచారం ప్ర‌కారం ఈమూవీలో హీరోయిన్ గా సిమ్రాన్ ను తిసుకున్న‌ట్లు తెలుస్తుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒక‌ప్పుడు అగ్ర‌క‌థనాయిక‌ల్లో సిమ్రాన్ కూడా ఒక‌రు. ఒక రజ‌నీ స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేయ‌డంతో ఆనందంలో ఉండిపోయింది సిమ్రాన్.

simran

టాలీవుడ్, కోలీవుడ్ లోని అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న సిమ్రాన్ న‌టించింది. గ‌త కొద్ది రోజుల క్రింద త‌మిళంలో మ‌ళ్లి రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల‌లో న‌టిస్తుంది. మ‌రొకొన్ని సినిమాల్లో గెస్ట్ గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. ప్ర‌స్తుతం ఈస‌నిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే సిమ్రాన్ షూటింగ్ లో పాల్గోన‌నుంద‌ని స‌మాచారం. వ‌రుస‌గా 40రోజుల‌పాటు డార్జిలింగ్ లో ఈసినిమా షూటింగ్ ను చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -