రజనీ – కమల్..క్రేజీ మల్టీస్టారర్!

11
- Advertisement -

వెండితెరపై మరో అద్భుత మల్టీస్టారర్ రాబోతుంది. దాదాపు 46 ఏళ్ల త‌ర్వాత వెండితెరపై కలిసి నటించనున్నారు అగ్రహీరోమలు క‌మ‌ల్‌-ర‌జ‌నీకాంత్. వీరిద్దరి కాంబోలో సినిమా రాక దాదాపు 46 ఏళ్లు అయింది. ప్రస్తుతం కమల్‌ రాజ్యసభ ఎంపీగా ఉండగా రజనీ సినిమాల్లో బిజీగా ఉన్నారు.

దుబాయ్ లో జరిగిన‌ సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ స్వయంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేయ‌డం విశేషం . ఇప్పటి వ‌ర‌కు తమ మధ్య పోటీని జనం సృష్టించారు కానీ రజినితో తనకు ఎలాంటి విభేదాలు లేవు అన్నారు. త్వరలోనే ఇద్ద‌రం చేతులు కలపబోతున్నామని అన్నారు.

అయితే ఈ ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎవరు నిర్మిస్తారు అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. కోలీవుడ్ టాక్ ప్రకారం దసరాకు ప్రకటన ఇచ్చి నవంబర్ లోపు షూటింగ్ మొదలు పెట్టొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ (కమల్ హాసన్) మరియు రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్) సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం.

Also Read:మన శంకరవరప్రసాద్ గారు..అప్‌డేట్

- Advertisement -