- Advertisement -
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం నిలిచింది.
కేటీఆర్ అమెరికాలో ఉండటంతో నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటూ మాగంటి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు కేటీఆర్ సతీమణి శైలిమ.నిన్న సాయంత్రం 4.30 గంటలకు ఛాతినొప్పితో ఇంట్లో స్పృహ కోల్పోయి పడిపోయారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎప్పటికప్పుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను కేటీఆర్ కు తెలియజేస్తున్నారు శైలిమ.
Also Read:కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల
- Advertisement -

