సీఎం స్టాలిన్‌ను కలిసిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ..

124
Rajinikanth
- Advertisement -

తమిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచారు. కొత్త కాలంగా త‌మిళ‌నాడులో కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సీఎం స‌హాయ నిధికి త‌మిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వ‌చ్చి క‌రోనా సాయం అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే సూర్య‌-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్‌, శివ‌కార్తికేయ‌న్ రూ.25 ల‌క్ష‌ల చొప్పున విరాళాలు అందించారు. ఇప్పుడు తాజాగా తలైవా ర‌జ‌నీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఈరోజు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ను క‌లిసి అందజేశారు.

- Advertisement -