ప్రతీ దవాఖానకు నిరంతరం విద్యుత్ సరఫరా- సీఎండీ

41

కరోనా విపత్కర సమయంలో కూడా విద్యుత్ సంస్థలు అందరం కలిసికట్టుగా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా విద్యుత్ డిమాండ్ తగ్గింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనరేషన్,సరఫరా చేయడం జరుగుతుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి దవాఖానకు విద్యుత్ ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని సూచించారు.

రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్స్ ఉన్నాయి. 130 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది,30 రిపిలింగ్ ఆక్సిజన్ స్టేషన్ లు కూడా ఉన్నాయి. విపత్కర పరిస్థితుల్లో విద్యుత్ కు ఆటంకం జరగకుండా అన్ని హాస్పిటల్ లకు రెండు సబ్ స్టేషన్ ల నుండి విద్యుత్ లైన్ లు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లకు ఈ రెండు లైన్ లు వేశాం. కోవిడ్ సమయంలో ఎం చేయాలో ఎం చేయవద్దో మా సిబ్బందికి తెలిపాం.వ్యాక్సినేషన్ కు గురించి మా సిబ్బంది అడిగారు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని.. ప్రభుత్వం అందరికి వ్యాక్సిన్‌ వేద్దాం అన్నారు అని సీఎండీ తెలిపారు.

రేపు యాదాద్రి తర్మల్ ప్లాంట్ మంత్రితో కలిసి సందర్శిస్తాం.మా కార్యాలయంలో జెన్కో ,ట్రాన్స్ కో కు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశాము,మా అధికారులు 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నాణ్యమైన విద్యుత్ నిరంతరం సరఫరా చేయాలి.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఇండ్లలో ఉన్నప్పటికీ నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను సకాలంలో మా కలెక్షన్ కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు చెల్లించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.

ఎస్పీ డిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో టీమ్స్, గాంధీ కోవిడ్ పెద్ద హాస్పిటల్ లు,వీటితో పాటు నిమ్స్ కూడా కోవిడ్ పెద్ద హాస్పిటల్.ఈ మూడు హాస్పిటల్ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాం.3 షిఫ్ట్ లో మా సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతి రోజు సీఎండీ లెవెల్ లో ఈ మూడు హాస్పిటల్ లను మానిటరింగ్ చేస్తున్నామని రఘుమా రెడ్డి తెలిపారు. ఈ మూడు కాకుండా మారో మూడు హాస్పిటల్ లను ఏర్పాటు చేశారు. చెస్ట్,ఫీవర్,కోటి దవాఖానలకు కూడా అదనపు విద్యుత్ ఏర్పాటు చేశాము. 113 దవాఖాన లలో కోవిడ్,1050 ప్రైవేట్ హాస్పిటల్ లలో కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. ఆ దవాఖానలకు ఆదనపు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం దవాఖానలలో 10 రోజుల్లో అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రైవేట్ హాస్పిటల్ లలో కూడా విద్యుత్ సంస్థ నుండి నోడల్ అధికారులను నియమించాము. హాస్పిటల్ లలో ఏదైనా విద్యుత్ ఆటంకం కలిగితే నోడల్ అధికారికి తెలియజేయాలి.సరఫరా ఆటంకం కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు.ప్రైవేట్ హాస్పిటల్ అదనపు లైన్ కావాలి అంటే ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మా సిబ్బంది 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు పని చేస్తున్నారు. ఇవాల్టి నుండి మా కలెక్షన్ కేంద్రాల్లో సడలింపు వేళలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు తెరిచి ఉంటాయి మీ బిల్లులను సకాలం లో చెల్లించండి అని ఎస్పీ డిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి సూచించారు.