లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా న్యూజిలాండ్‌లో లియో మూవీ 2,01,148 డాలర్లను వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రం వసూళ్లను బ్రేక్ చేసింది. అయితే గతంలో రజనీకాంత్ రోబో చిత్రం 3 లక్షల డాలర్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. రోబో చిత్ర వసూళ్లను కూడా లియో బ్రేక్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి జైలర్ రికార్డ్స్ ను లియో బ్రేక్ చేయడం నిజంగా విశేషమే. అందుకు ముఖ్య కారణం.. లియోకి హిట్ టాక్ రాలేదు. అలాగే, లియో సెకండాఫ్ కూడా పెద్దగా బాగాలేదు.
అయినప్పటికీ, లియో చిత్రం జైలర్ చిత్రం రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. దళపతి విజయ్ కి కేవలం తమిళనాడులో మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారు అని, మిగిలిన రాష్ట్రాల్లో అలాగే మిగిలిన దేశాల్లో విజయ్ కి ఎలాంటి ఫ్యాన్స్ లేరని.. సోషల్ మీడియాలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారందరికీ లియో గట్టి సమాధానం ఇచ్చినట్లు అయ్యింది. ఈ విషయంలో లోకేష్ కనగరాజ్ ను కూడా అభినందించాలి. సినిమాని ఆయన తెరకెక్కించిన విధానం చాలా పవర్ ఫుల్ గా ఉంది. అందుకే, సినిమాలో భారీ కథ లేకపోయినా.. జనం కనెక్ట్ అయ్యారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా లియో ఈనెల 19న విడుదలై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అన్నట్టు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్‌లో నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించారు.
Also Read:Charanraj:’నరకాసుర’ అందరికి నచ్చుతుంది