చంద్రబాబు పెత్తనం అవసరమా..?:కేసీఆర్

220
kcr
- Advertisement -

రానున్న రెండు సంవత్సరాల్లో కల్వకుర్తిలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తనది అన్నారు సీఎం కేసీఆర్.కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన కేసీఆర్ కల్వకుర్తిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. గత పాలకులు ఎప్పుడూ కల్వకుర్తి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఇక్కడి ప్రజలకు ప్రజలకు కన్నీళ్లే మిగిలాయన్నారు.కల్వకుర్తి ఎత్తిపోథల పథకాన్ని ఆగమేఘాల మీద పూర్తిచేసి 30 వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.

గొల్ల,కురుమ సోదరుల కోసం రూ. 5 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశామన్నారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని చెప్పారు. ఓ వైపు కాంగ్రెస్,టీడీపీ మరోవైపు స్వరాష్ట్రం కోసం కొట్లాడిన,మన రాజ్యం మనకు తెచ్చిన టీఆర్ఎస్ ఉందన్నారు. నాడు కాంగ్రెస్,టీడీపీ పాలనకు నేటి టీఆర్ఎస్ పాలనకు తేడా గమనించాలన్నారు. నాడు కరెంట్ కోసం
ధర్నాలు జరిగేవని కానీ నేడు రెప్పపాటు కూడా కరెంట్ పోనివ్వడం లేదన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టినా అని చెప్పుకునే చంద్రబాబు కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయాడో చెప్పాలన్నారు. కల్వకుర్తి వెనుకబాటు తనం పోవాలంటే టీఆర్ఎస్‌కు ఓటేసీ గెలిపించాలన్నారు.

ఎన్నికలు వస్తాయి పోతాయి కానీ ప్రజలు ముఖ్యమన్నారు. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో వారే గెలవాలన్నారు. న్యాయం వైపు ప్రజలు నడవాలన్నారు. ఇక్కడి నుండి గెలిచిన నాయకులు ఢిల్లీ స్ధాయికి ఎదిగినా ప్రజలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో చంద్రబాబు పెత్తనం అవసరమా అని ప్రజలను ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నాటి నుండి నేటివరకు పనికిమాలిన ఆలోచనలతో దద్దమ్మల్లా వ్యవహరించారని తెలిపారు. కల్వకుర్తిలో వృత్తి కార్మికులు ఏ విధంగా నష్టపోయారో అందరికీ తెలుసన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పదిరోజుల్లోనే కల్లు దుఖానాలను తెరిపించామన్నారు. రైతు బంధు పథకంతో రైతులకు భరోసా కల్పించామన్నారు. రైతు భీమాతో రైతులకు
ధీమా కల్పించామన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ. 5లక్షల భీమాను 15 రోజుల్లో అందిస్తున్నామని చెప్పారు.

- Advertisement -