సామజవరగమన @ 30 మిలియన్ వ్యూస్

527
allu arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-పూజా హెగ్డే కాంబినేషన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో. 2020 సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈసినిమాను అల్లు అరవింద్, కె.రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ అందరిని అకట్టుకోగా ఫస్ట్ సింగిల్‌తో మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది చిత్రయూనిట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సామజవరగమన లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ మ్యూజిక్ అందించగా సిధ్ శ్రీరామ్ పాడారు.

ప్రస్తుతం ఈపాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు 30 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో భారీగా అంచనాలు నెలన్నాయి.

https://youtu.be/Thf60JU8E98

- Advertisement -