కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తన 169వ సినిమాగా ‘ జైలర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకముందే, రజనీ తన 170వ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు టాలెంటెడ్ యంగ్ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, రజనీ ఇటీవల లవ్ టుడే దర్శకుడు ప్రదీప్ రంగనాథన్, జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్లను కలిశారు. ఈ ఇద్దరు దర్శకులు చెప్పిన కథాంశాలతో రజనీ బాగా ఎట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది. ఇద్దరికీ ఫైనల్ కాల్ తీసుకునే ముందు బౌండ్ స్క్రిప్ట్‌తో రావాలని వారిని రజినీ కోరారని టాక్.
ప్రదీప్ రంగనాథన్ కథకు సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు, TJ జ్ఞానవేల్ మరొక సోషల్ డ్రామా కథ చెప్పాడని ఇన్సైడ్ టాక్. మరి ఈ ఇద్దరిలో సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇంకొద్ది రోజుల్లో తెలియనుంది.
ఇవి కూడా చదవండి..