రజినీ అందుకే ప్రొడ్యూస్‌ చేయలేదు

26
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్‌ కీలకపాత్ర పోషించిన ‘లాల్‌ సలామ్‌’ ఈనెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని నిర్మించకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. ‘రజినీకాంతే ఎందుకు ఈ సినిమాని ప్రొడ్యూస్‌ చేయకూడదు? అని అనుకుని ఉంటారు. అయితే ‘బాబా’ చిత్రం తర్వాత నిర్మాతగా చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని రజనీకాంత్ తెలిపారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో 1మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

అన్నట్టు, ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు విష్ణు విశాల్, విక్రాంత్ కూడా హీరోలుగా నటిస్తున్నారు. పైగా ‘లాల్ సలామ్’ మూవీలో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా గురించి విష్ణు విశాల్ మీడియాతో మాట్లాడుతూ.. రజని సార్‌ నటించిన మూవీలో నటించడం నా అదృష్టం. ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లో రజనీకాంత్ సార్‌ ని కలిశాను. ఆయన నవ్వుతూ పలకరించిన తీరు జీవితంలో మరిచిపోలేను. ఈ మూవీలో నా పాత్ర రకరకాల పార్శాలతో కూడుకున్నది. అరుదుగా మాత్రమే ఇలాంటి పాత్రలు దొరుకుతుంటాయని విష్ణు విశాల్ చెప్పారు.

విక్రాంత్ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇది నాకు మరచిపోలేని అనుభూతి. పైగా సూపర్ స్టార్ రజినీ కాంత్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమాకి రజినీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడం గొప్ప విషయం అంటూ మాట్లాడారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి, ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

Also Read:KCR:13న ఛలో నల్గొండ..మా నీళ్లు మాకే

- Advertisement -