డిజాస్టర్ రీ రిలీజ్ కోసం రజినీ కష్టాలు

108
- Advertisement -

ప్రస్తుతం రీ రిలీజ్ ల హంగామా నడుస్తుంది. సూపర్ స్టార్ రజినీ కాంత్ పుట్టిన రోజున ఆయన నటించిన ‘బాబా’ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని మార్పులతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రజినీ కాంత్ మరోసారి బాబా కోసం డబ్బింగ్ చెప్తున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రజినీ కొంత వరకూ వాయిస్ ఓవర్ ఇచ్చేలా ఏదో ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు ఈ సినిమా కోసం ఏ ఆర్ రెహ్మాన్ కూడా మళ్ళీ రీ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఏదేమైనా రజినీ పుట్టిన రోజు నరసింహా లాంటి సెన్సేషనల్ సినిమా రీ రిలీజ్ చేయాలని కానీ ఆయన కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన బాబా ఎందుకు వేస్తున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. బాబా డిజాస్టర్ అయినప్పటికీ రజినీ కేరెక్టర్ , ఫిలాసఫీతో చెప్పే డైలాగ్స్ , సాంగ్స్ , దైవత్వం ఇలా అన్ని కలిసి ఆ సినిమా రజినీ ఫ్యాన్స్ కి ఇప్పటికీ ఫేవరేట్ అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాను రజినీ ఫ్యాన్స్ కోసం మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. మరి రజినీ బాబా రీ రిలీజ్ తమిళ నాట ఎంత ఎంత వసూళ్ళు చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -