కరోనా సెకండ్ వేవ్..భారీ మూల్యం చెల్లించాల్సిందే..!

116
rajesh
- Advertisement -

దేశంలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ లాంటి రాష్ట్రాల్లో రోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతుండగా ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పరిస్ధితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని..… అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.

ముందస్తుగానే కంటైన్మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పడదని లేఖలో హెచ్చరించారు రాజేశ్ భూషణ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తోందని… అయితే, దీనికి తగ్గట్టుగా గట్టి చర్యలను తీసుకోవడం లేదని చెప్పారు. అంతేకాదు కరోనా నిబంధనల గతంలో మాదిరిగానే అమలు చేయాలని అన్నారు. మహారాష్ట్రలో కరోనాను గుర్తించడం, టెస్టింగ్, ఐసొలేషన్ (ట్రాక్, టెస్ట్, ఐసొలేట్) వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపట్టడం లేదని అన్నారు.

- Advertisement -