సారీ చెప్పిన రాజేంద్రప్రసాద్

16
- Advertisement -

డేవిడ్ వార్నర్ అభిమానులకు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పారు. రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌పై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న నటుడు రాజేంద్ర ప్రసాద్, వార్నర్ అభిమానులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.

తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదని, నితిన్, వార్నర్ తనకు పిల్లల్లాంటి వారని, సరదాగా చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా గాయపడితే క్షమించమని కోరారు. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు.

‘రాబిన్‌హుడ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరుకాగా ఆయన్ని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. క్రికెట్ ఆడవయ్యా అంటే స్టెప్పులు వేశాడూ.. రేయ్ వార్నరూ..’ అంటూ మాట్లాడగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కితగ్గారు.

Also Read:హోంశాఖ అంటే ఇష్టం..కోమటిరెడ్డి మనసులో మాట

- Advertisement -