మూసీ నది బఫర్ జోన్‌..అక్రమ నిర్మాణాలు కూల్చివేత

35
rajendranagar

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రెవెన్యూ పరిధి జియాగుడ కమేళా సమీపంలో ని మూసీనది బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు.పలుమార్లు నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేశారు భూబకాసురులు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు.

రాజేంద్రనగర్ ఎమ్మార్వో చంద్రశేఖర్ గౌడ్,మూసి రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ మాలతి ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగాయి. రాజకీయ నాయకులు అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు ఎమ్మార్వో చంద్రశేఖర్ గౌడ్.