- Advertisement -
నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాజకీయాలకు అతీతంగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఆయన చేసిన సేవలను గుర్తుచేస్తూ కొనియాడుతున్నారు.
తాజాగా సినీనటుడు రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ ద్వారానే నేను మద్రాస్ ఫిలిం స్కూల్‌లో చేరాను. ఆయన పెట్టిన భిక్ష వల్లే మంచి నటుడిగా మీ ముందు ఉన్నానని చెప్పారు.
మనతో ఉన్న పది మందికి సాయం చెయడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి. కొన్ని సంవత్సరాలు ఆయన పక్కనే ఉండి ఆయన్ని దగ్గరగా చూసిన వ్యక్తిని తాను అన్నారు. సమాజమే దేవాలయం అన్న మహా మనిషి అని కొనియాడారు.
- Advertisement -