ఎలైట్ జాబితాలో రాజస్థాన్

3
- Advertisement -

ముల్లన్‌పూర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 40వ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించడం ద్వారా, ఈ సీజన్‌లో  పంజాబ్ అజేయమైన విజయ పరంపరకు రాజస్థాన్ బ్రేక్ వేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించి 19.2 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో ఈ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)లను రాజస్థాన్ రాయల్స్ అధిగమించింది రాజస్థాన్.

రాజస్థాన్ రాయల్స్ మరియు ముంబై ఇండియన్స్ చెరో 6 సార్లు 200+ పరుగులను ఛేజ్ చేసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. విజయం అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ, తాము మ్యాచ్‌ను ఒక సాధారణ ఆటగానే పరిగణించామని, అతిగా ఆలోచించకుండా ప్రణాళికలను అమలు చేశామని తెలిపారు. బ్యాటర్లు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారని ఆయన కొనియాడారు.

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో తమ మొదటి ఓటమిని చవిచూడటంతో పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానాల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ ఓపెనర్లు మరియు డోనోవన్ ఫెరీరా ఈ అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించారు.

Also Read:ఏపీ కేబినెట్ భేటీ..కొత్త పెన్షన్లపై చర్చ

- Advertisement -