రాజస్థాన్ రాయల్స్‌ రాజసం….

46
rr

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్‌…మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. 19.4 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 150 పరుగులు చేసి జట్టను గెలిపించాడు మోరీస్.

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన రాయల్స్ కి ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు ఇద్దరు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరగా ఆ తర్వాత ఓవర్లోనే కెప్టెన్ సంజు కూడా ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మిల్లర్(62) అర్ధశతకంతో రాణించాడు. చివరలో క్రిస్ మోరిస్ 18 బంతుల్లో 36 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 27 పరుగులు అవసరం ఉండగా నాలుగు సిక్స్ లు బాది మరో రెండు బంతులు ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో కెప్టెన్ పంత్(51) అర్ధశతకంతో రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.