చెన్నైపై రాజస్ధాన్ గెలుపు

289
rr
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్ధాన్ రాయల్స్ గెలుపొందింది. చెన్నై విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కొల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో సీఎస్‌కేపై గెలుపొంది టోర్నమెంట్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది రాజస్ధాన్.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ ఆరంభంలోనే వికెట్లు కొల్పోయింది. ఉతప్ప 4,శాంసన్ 0,స్టోక్స్ 19 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో 28 పరుగులకే 3 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన స్మిత్, బట్లర్ ఆచితూచి ఆడారు. కెప్టెన్ స్మిత్ నెమ్మదిగా ఆడిన బట్లర్ మాత్రం తన సహజశైలీలో దూకుడుగా ఆడాడు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ఫోర్లతో విరుచుకపడ్డాడు.ముఖ్యంగా పీయూష్ చావ్లా బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి రాజస్ధాన్ గెలుపును సులభతరం చేశాడు. స్మిత్ 26 పరుగులు చేయగా బట్లర్ 70 పరుగులు చేసి రాజస్ధాన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 125 పరుగులే చేసింది.ఆల్‌రౌండర్‌ జడేజా(35: 30 బంతుల్లో 4 ఫోర్లు),శామ్‌ కరన్‌(22: 25 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్సర్‌), కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(28: 28 బంతుల్లో 2ఫోర్లు) రాణించగా డుప్లెసిస్‌(10), వాట్సన్‌(8), అంబటి రాయుడు(13) నిరాశపర్చారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌(1/20), కార్తీక్‌ త్యాగీ(1/35), శ్రేయాస్‌ గోపాల్‌(1/14), రాహుల్‌ తెవాటియా(1/18) వికెట్ పడగొట్టారు.

- Advertisement -