రాజస్ధాన్ కాంగ్రెస్ సర్కార్ సంక్షోభం దిశగా పయనీస్తోంది.తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ శాసనభపక్షం.రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీస్ శాఖలోని ప్రత్యేక ఆపరేషన్ల బృందం(ఎస్‌వోజీ).
సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తో పాటు చీఫ్ విప్, కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు ఎస్‌వోజీ పోలీసులు నోటీసులు అందించారు.స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు ఎస్‌వోజీ పోలీసులు.
పోలీసుల నోటీసులపై ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కొంత మంది శాసనసభ సభ్యులతో ఢిల్లీ చేరారు ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్.సచిన్ పైలట్ వెంట సుమారు 30మంది కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.ఇక రేపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో కాంగ్రెస్ శాసనసభపక్షం సమావేశం జరగనుంది.