తెలంగాణ బీజేపీలో కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్‌పై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించగా ఇది రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.
ఈ నేపథ్యంలో మాట్లాడిన రాజాసింగ్…తన అభిప్రాయం వెల్లడించినప్పటి నుంచి కరీంనగర్ కేంద్రంగా తనపై కొందరు యుద్ధం ప్రారంభించారని పరోక్షంగా బండి సంజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.పెద్ద ప్యాకేజీ దొరికితే మనవాళ్లు ఎప్పుడో బీఆర్‌ఎస్‌తో కలిసిపోయేవారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ నేతలు ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని, దానివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
అయితే గతంలో రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలను బండి సంజయ్ చొరవ తీసుకుని పరిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా బండి సంజయ్‌నే లక్ష్యంగా చేసుకుని రాజాసింగ్ వ్యాఖ్యలు చేయడం కమలం పార్టీలో మరోసారి అంతర్గత పోరును స్పష్టం చేస్తోంది.
Also Read:బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు

