ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను టిటిడి బోర్డు మెంబర్ గా పెట్టొచ్చా.. చంద్రబాబుకు నాదొక విజ్ఞప్తి అన్నారు.
టిటిడి బోర్డు మెంబర్ గా నియమించేముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మం పై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలి అన్నారు. ఇలాంటి వాళ్లు టిడిపిలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలుగా ఉన్నారో చంద్రబాబు ఒకసారి సర్వేచేయాలి ..ఎమ్మెస్ రాజును పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలి అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన కామెంట్స్ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. భగవద్గీత వల్ల ప్రజల బతుకులు మారలేదని కామెంట్ చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
Also Read:గ్రామీణ యాక్షన్ డ్రామా…కరుప్పు!

