RSSపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో అల్లర్లు, హింసకు కారణం ఆర్‌ఎస్‌ఎస్(RSS).. పటేల్ ఆశయాలను మోదీ గౌరవిస్తునట్లు అయితే తక్షణమే RSS ని బ్యాన్ చేయాలి అన్నారు.
సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించారని గుర్తుచేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలి అని ఖర్గే శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఆయన “విషం”తో పోల్చారు.
పటేల్.. ఆర్ఎస్ఎస్, జమాత్-ఎ-ఇస్లామీ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడాన్ని నిషేధించారు. కానీ మోడీ ప్రభుత్వం 2024 జూలై 9న ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. మేము ఆ నిషేధాన్ని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. సర్దార్ పటేల్ ఒక లేఖలో ఆర్ఎస్ఎస్.. మహాత్మా గాంధీ మరణాన్ని సంబరంగా జరుపుకుందని పేర్కొన్నారు. అందుకే 1948లో ఆ సంస్థపై నిషేధం విధించక తప్పలేదని పటేల్ చెప్పారని అన్నారు.
సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ఆయన కృషిని ఎల్లప్పుడూ ప్రశంసించారు. 1948 ఫిబ్రవరి 4న పటేల్ రాసిన లేఖలో ‘ఆర్ఎస్ఎస్ గాంధీజీ మరణాన్ని జరుపుకుంది, మిఠాయిలు పంచింది’ అని ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం వద్ద మరో మార్గం లేదు అని ఖర్గే పేర్కొన్నారు.
Also Read:Kohli:జెమీమా పోరాటం అద్భుతం

