- Advertisement -
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో కొందరు పోలీసులు లంచాలు తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అన్నారు.
పోలీసుల ఛాంబర్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టాలని… కరీంనగర్ జమ్మికుంట సీఐ రవి కుమార్ ఒక బాధితుడి నుండి రూ.3 లక్షలు లంచం తీసుకున్నాడు అన్నారు.గతంలో షాహినాజ్ గంజ్ పోలీసు స్టేషన్ సీఐ బాబు చౌహన్ ఒక వ్యక్తిని కేసు నుండి తప్పించడానికి లంచం అడిగాడు అన్నారు.
లంచాలు అడిగే పోలీసులను ఉద్యోగాల నుండి టర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు రాజాసింగ్.
Also Read:మాజీ సీఎం కేసీఆర్ ఇంట విషాదం..
- Advertisement -

