సినిమాను బ్రతికించండి..!

108
shekar
- Advertisement -

రాజశేఖర్ హీరోగా, శివాని ముఖ్యపాత్రలో తెరకెక్కిన సినిమా శేఖర్. మలయాళం సూపర్ హిట్ సినిమా ‘జోసెఫ్’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. మే 20న థియేటర్లలో రిలీజ్ కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డైరెక్టర్ సుకుమార్ విచ్చేశారు.

అ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ…ఈ ఫంక్షన్ కు సుకుమార్, సముద్ర ఖని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చావు నుండి తిరిగొచ్చి సినిమా చేయగలిగాను అంటే దానికి కారణం మీ అందరి ఆశీర్వాదం అన్నారు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు అందరూ కలసి నన్ను బతికించినట్లే నా సినిమాను చూసి మా బతుకు తెరువును కూడా మళ్లీ బతికించండని కోరారు.

ఇక జీవిత మాట్లాడుతూ..తాను అందరిలాగే సాధారణమైన మనిషినే. నాకు ఊహ తెలిసినప్పటినుండి నేను లైఫ్ తో ఫైటింగ్ చేస్తున్నాను. నేను ఎవరినీ, ఎప్పుడూ మోసం చేయలేదు. నాకు చేతనైన సహాయం చేశానని తెలిపారు.

- Advertisement -