జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శేఖర్. మే 20న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ సినిమా ట్రైలర్‌ని లాంచ్ చేశారు. శివానీ, శివాత్మిక, బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాసరావు, వంకాయలపాటి మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. రాజశేఖర్ తో పాటు ఆయన పెద్ద కూతురు శివానీ కూడా కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా హీరో రాజశేఖర్ మాట్లాడుతూ…మాది సినిమా కుటుంబం. సినిమానే మా ప్రపంచం. కరోనా కారణంగా ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయాం అన్నారు. మే 20న రిలీజ్ చేస్తున్నాం. మాకు మే 20వ తేదీనే సంక్రాంతి అన్నారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ సినిమాను నమ్ముకుని ఉన్న వ్యక్తులం మేం. ఇక్కడే సంపాదించాం, ఇక్కడే పోగొట్టుకున్నాం. చాలామంది శేషు తర్వాత పూర్తి స్థాయిలో ఎందుకు దర్శకత్వం వహించలేదు?’ అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని తెలిపారు. శేఖర్ మూవీ చాలా బాగా వచ్చింది. ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు నా ధన్యవాదాలు చెప్పారు.