శర్వా ‘మనమే’లో రాజశేఖర్!

22
- Advertisement -

శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ చిత్రం మనమే . శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ అద్భుతంగా నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక టీజర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు దర్శకుడు.

ఇది పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని అతిథి కథ. మూడు పాత్రల మధ్య రిలేషన్ ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్ గా కట్ చేశాడు. ఈ హాలిడే సీజన్‌లో ‘మనమే’ థియేటర్లలోకి రానుంది.

ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజశేఖర్ ఓ కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. శర్వా తండ్రి పాత్రలో కనిపించనుండగా రాజశేఖర్ కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడట. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:సూపర్ మెన్ ఫోజ్…ఎన్ని లాభాలో!

- Advertisement -