ఒకే మూవీలో శివానీ, శివాత్మిక..!

236
Shivani Shivathmika
- Advertisement -

టాలీవుడ్‌ హీరో రాజశేఖ‌ర్ కుమర్తెలు శివానీ, శివాత్మికలు ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్నారు. వీరిలో శివాత్మిక దొర‌సాని చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇవ్వగా, ప్ర‌స్తుతం రంగ‌మార్తాండ చిత్రం చేస్తుంది. ఇక శివానీ ఇప్ప‌టికే 2 స్టేట్స్ అనే చిత్రంలో అడ‌వి శేష్‌తో క‌లిసి న‌టించింది. ఆ చిత్రం విడదల కావాల్సివుంది. త్వ‌ర‌లో తేజ స‌జ్జా ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

ఇక అసలు విషయానికొస్తే.. ఈ ఇద్దరు ముద్దు ముద్దుగుమ్మలు కలిసి ఒకే చిత్రంలో కనిపించి ప్రేక్షకులను ఆలరించబోతున్నట్లు సమాచారం. శివానీ, శివాత్మిక‌లు ఒకే మూవీలో నటించబోతున్నట్లు ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి గ‌రుడ వేగ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వం వహించానుండగా,జీవిత రాజశేఖర్‌ నిర్మించ‌నున్నారు. ఈ చిత్రంలో ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేంలో క‌నిపిస్తార‌ని సినీ వర్గాల సమాచారం. ఇందు కోసం కథ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

- Advertisement -