మెగాస్టార్ చిరంజీవి .. డాక్టర్ రాజశేఖర్ మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. ఠాగూర్ సినిమా నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక చిరంజీవి ప్రజారాజ్యం స్ధాపించిన సమయంలో రాజశేఖర్ …బహిరంగ విమర్శలు గుప్పించగా విభేదాలు రచ్చకెక్కాయి. చిరు అభిమానులు రాజశేఖర్‌పై దాడికి సైతం ప్రయత్నించారు. అయితే ఇదంతా గతం.
ప్రస్తుతం సీన్ రివర్సైంది. వీరిద్దరి మధ్య పాత స్నేహం చిగురించింది. మెగాస్టార్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు రాజశేఖర్ దంపతులు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం పీఎస్‌వీ గరుడవేగ. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘గరుడవేగ’ ప్రత్యేక ట్రైలర్‌ను ఆయనకు చూపించారు.
ట్రైలర్ చూసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ మంచి యాక్షన్ చిత్రంలా ఉందని.. సినిమాని చూసి తప్పకుండా తన స్పందనను తెలియజేస్తానని చెప్పారు. మొత్తానికి చిరు..రాజశేఖర్‌లు కలిసిపోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.