పెళ్లికి ముందు అఫైర్స్ అంటున్న హీరో..

224
- Advertisement -

సీనియర్ హీరో రాజశేఖర్ గరుడవేగ సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం గరుడవేగ సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్‌ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గరుడవేగ పార్ట్ 2లో బాలకృష్ణ గారిని నటించమని తానే ప్రపోజల్ పెట్టానని చెప్పారు. మనిద్దరం సినిమా చేద్దామనగానే ఆయన సరే అన్నారని తెలిపారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై సింహా చిత్రంలో ఓ పాత్రలో నటించమని బాలయ్య తనను అడిగారని దానికి తాను ఒప్పుకోలేదని చెప్పారు. తామిద్దరం తొలిసారి నటించాల్సిన సినిమా అది కాదని రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూ సందర్భంగా రాజశేఖర్ కు ఓ అనుకోని ప్రశ్న ఎదురైంది.

Rajasekhar denies links with Tara Chowdary

అయితే గతంలో సంచలనం రేపిన తారాచౌదరి కేసులో రాజ శేఖర్ పేరు వినిపించిందని దానిపై ఆయన స్పందన ఏమిటని ప్రశ్నించగా.. తారాచౌదరీతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తారా చౌదరి ఇంట్లో తనతో దిగిన ఫొటో ఉండటం వల్లే ఆ వివాదంలో తన పేరు వినిపించిందన్నారు. ఆ ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారాచౌదరిని కలిశానని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఉంటున్న పోర్షన్ కు పక్కనే ఉన్న పోర్షన్ ను చూసేందుకు వెళ్లినపుడు మరోసారి కలిశానని చెప్పారు. తనకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదని ఒకవేళ ఎవరితో అన్నా అటువంటి సంబంధం ఉంటే తానే నిర్భయంగా చెప్పేస్తానని అన్నారు.

తాను కేవలం జీవితకు మాత్రమే భయపడతానన్నారు. అయితే దాంపత్య జీవితంలో తాను రాముడిని కాదని కానీ తారా చౌదరి విషయంలో రాముడినేనని చెప్పారు. పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయని జీవితతో పెళ్లి తర్వాత కొన్ని ఘటనలు యాక్సిండెట్ గా జరిగిపోయాయని అన్నారు. అలాగని తాను కృష్ణుడిని కూడా కాదన్నారు. ఇండస్ట్రీలో తనపై ఉన్న ప్లేబాయ్ ముద్ర కరెక్ట్ కాదన్నారు.

- Advertisement -