యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం “ది రాజా సాబ్”. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ఈ చిత్రంలో ప్రభాస్‌కు తాత పాత్రలో కనిపించనున్నారు. ఇవాళ సంజు బాబా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో ఆయన పొడవాటి జుట్టు, మీసాలతో వృద్ధుడిగా కనిపిస్తున్నారు.
ఈ చిత్రం 2025 డిసెంబరు 5న పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్ శ్రీను, బోమన్ ఇరానీ, వీటీవీ గణేశ్, సప్తగిరి, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలి కేకలు!

