తెలంగాణ సివిల్ సప్లైస్ స్కాంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు ప్రత్యేక్షంగా పాల్గొన్నారు అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక 420 పార్టీ అని ఆరోపించారు.
సివిల్ సప్లైస్ కుంభకోణం గురించి పార్క్ హయత్ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన మంతనాల గురించి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అన్నారు. సివిల్ సప్లైస్ కుంభకోణంలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఎన్ని సార్లు ఆదేశించినా సప్పుడు చేస్తలేదు అన్నారు. ముగ్గురు చీఫ్ జస్టిస్‌లు మారారు కానీ ప్రభుత్వం అయితే కౌంటర్ నివేదిక ఇవ్వలేదు అన్నారు.
తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన రూ.1100 కోట్ల భారీ కుంభకోణంపై గత 20 నెలలుగా ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అన్ని ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నెలలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అయితే ఇప్పటివరకు ఎలాంటి కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read:ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల ఆకలి కేకలు!

