దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..నా గురువుకు అంకితం

161
rajini
- Advertisement -

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తన గురువు బాలచందర్‌కు అంకితమిచ్చారు రజనీకాంత్. న్యూ ఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న రజనీ…కుటుంబ సభ్యుల సమక్షంలో అవార్డును అందుకున్నారు.

నా తండ్రి లాంటి సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ నాకు గొప్ప విలువలు నేర్పించినందుకు, నాలో ఆధ్యాత్మికతను పెంపొందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు రజనీ. నాలోని నటుడిని గుర్తించి నన్ను సినిమాల్లోకి వెళ్ళమని ప్రోత్సహించిన వ్యక్తి.. నన్ను నమ్మి నాతో సినిమాలు చేసిన గౌరవనీయులైన దర్శకులు, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సాంకేతిక నిపుణులకు, పంపిణీదారులకు ధన్యవాదాలు. ప్రదర్శకులు, మీడియా, నా అభిమానులందరికీ, తమిళ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మీరు లేకుండా నేను లేను అన్నారు రజనీ.

రజనీకాంత్ 1975లో దివంగత దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో అరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌తో 160కి పైగా చిత్రాలలో నటించారు.

- Advertisement -