మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని సూపర్ స్టార్ రజనీకాంత్ ఘనంగా సత్కరించారు. రోడ్డుపై పడి ఉన్న సుమారు 45 సావరిన్ల బంగారు ఆభరణాలను ఎలాంటి ఆశ లేకుండా అసలు యజమానికి అప్పగించి నిజాయితీని చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను రజనీకాంత్ స్వయంగా తన ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు.
పద్మ చేసిన ఈ నిజాయితీ పనిని అభినందించిన రజనీకాంత్, ఆమెకు బంగారు గొలుసును బహుమతిగా అందజేశారు. అంతేకాదు, కష్టపడి పనిచేసే వారి నిజాయితీ సమాజానికి ఆదర్శమని కొనియాడారు.
పద్మ చేసిన కార్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న నేపథ్యంలో, రజనీకాంత్ లాంటి ప్రముఖుడు ఆమెను గౌరవించడం మరింత ప్రేరణగా మారింది. సాధారణ వ్యక్తుల్లోనూ అసాధారణ మానవత్వం దాగి ఉంటుందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
Also Read:KTR:కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టండి

