వైభవంగా కార్తికేయ-పూజా వివాహం

254
karthikeya rajamouli
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహ వేడుక సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.రాజస్థాన్‌ రాజధాని జయపుర‌లోని ఓ ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి కార్తికేయ- పూజా ప్రసాద్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా, అఖిల్ తదితరుల హాజరయ్యారు.

రాజమౌళి కుమారుడి పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌
అవుతోంది. పూజ..కార్తికేయను ‘ss’ అని ఇంటి పేరుతో సంబోధిస్తారట. అందుకే శుభలేఖలోనూ ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది.

 rajamouli son kartikeya marriageఇక పెళ్లికి మూడు రోజుల ముందునుండే సంగీత్‌లో టాలీవుడ్ అగ్రహీరోలు సందడిచేశారు. తారక్, ప్రభాస్, రాజమౌళి ఫ్యామిలీ డాన్స్‌లు సోషల్ మీడియాలో సందడిచేస్తున్నాయి.

కార్తికేయ భార్య పూజా…జగపతిబాబు అన్నయ్య కూతురు. సినిమా ఇండస్ట్రీలో కంటే ఆధ్యాత్మిక గాయనిగా పూజా ప్రసాద్‌కు మంచి గుర్తింపు ఉంది. పలు సంగీత విభావరిలలో భక్తి గీతాలు ఆలపించి ఆధ్యాత్మిక గాయనిగా గుర్తింపుపొందింది.

- Advertisement -