పేట…న్యూఇయర్‌ విషెస్‌

274
rajanikanth
- Advertisement -

న్యూఇయర్ కానుకను ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్-త్రిష కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. జనవరి 10న సినిమా విడుడల కానుండగా న్యూఇయర్ కానుకగా తెలుగు ట్రైలర్‌ ప్రొమోని విడుదల చేశారు.

చాడబోతున్నారుగా కాలీ ఆటను అంటూ మొదలయ్యే ట్రైలర్ ప్రొమో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సంక్రాంతి వరకు ప్రతి ఒక్కరిని మీ పేటలో కలుస్తా అప్పటివరకు హ్యాపీ న్యూఇయర్‌ అంటూ విషెస్ చెప్పాడు రజనీ. ట్రైలర త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు.

‌రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అనిరుధ్ ర‌విచంద్రన్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. సిమ్రాన్‌, విజ‌య్ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాశ్‌, న‌వాజుద్దీన్ సిద్ధిఖీ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. పేట..ప్రొమోపై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -