‘ఘాజీ’ పై జక్కన్న అదిరిపోయే ట్వీట్‌..!

211
Rajamouli Tweet about 'Ghazi' movie
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి నోరు విప్పితే చాలు ఆ మాటకి చాలా వాల్యూ ఉంటుంది. అలాగే తన ట్వీట్స్ తో ఇచ్చే మినీ రివ్యూలకు కూడా అదే తరహా వాల్యూ ఉంది. అందుకే చాలా మంది హీరోలు, దర్శకులు కూడా ఆయన మాట కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే..తెలుగు ఆడియన్స్ ఆ మూవీపై ఓ ఫీలింగ్ ఏర్పడేలా జక్కన్న ట్వీట్ రివ్యూలు ఉంటాయి కాబట్టి. ప్రస్తుతం ఈ జక్కన్న బాహుబలి2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.

బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రను పోషించిన దగ్గుపాటి రానా ఇటీవలే ‘ఘాజీ’ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే సహజంగా మంచి హైప్ ఉన్న సినిమాలు అన్నిటినీ రిలీజ్ రోజే చూసి ట్వీట్ చేసే జక్కన్న.. ఘాజీ విషయంలో మాత్రం ట్వీట్ పెట్టకపోవడం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయింది.

ఈ చర్చలకు రాజమౌళి చెక్‌ పెట్టేశాడు. ఘాజీపై లేటుగా అయినా అదిరిపోయే ట్వీట్ పెట్టాడు రాజమౌళి. గత రాత్రి ఘాజీ సినిమా చూసిన రాజమౌళి.. తన రియాక్షన్ ని ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ‘ఆన్ స్క్రీన్ పైనా.. ఆఫ్ స్క్రీన్ లోనూ.. కెప్టెన్ అండ్ క్రూ అదిరిపోయే పెర్ఫామెన్స్ చూపించారు. టీం ఘాజీ సూపర్బ్. కంగ్రాచ్యులేషన్స్ రానా’ అంటూ ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు రాజమౌళి ఈ చిత్రాన్ని అద్భుతం అంటూ ట్వీట్ చేయడం.. ఘాజీకి మరింత హెల్ప్ కానుంది.

ఇక కొత్త దర్శకుడు సంకల్ప్ తీసిన ‘ఘాజీ’కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రివ్యూలు రేటింగుల విషయంలో కూడా ఘాజీ డామినేషన్ చూపించింది. అంతే కాదు ఈ సినిమా వసూళ్ళు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి.

 Rajamouli Tweet about 'Ghazi' movie

- Advertisement -