రాంచరణ్‌ బ్యానర్‌లో యంగ్‌టైగర్‌….

165

చలన చిత్ర పరిశ్రమలో ఏ హీరోలకైన పోటీ ఎక్కువగానే ఉంటుంది. నందిమూరి ఫ్యామిలీ వర్సెస్‌ కొణిదల ఫ్యామిలీలో సినిమాల మధ్య బాగానే బంధం ఉన్నప్పటీకి రాజకీయాల్లో మాత్రం రెండు కుటుంబాల మధ్య పెద్ద పోటీనే ఉంది. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల హీరోల మధ్య స్నేహిపూరితమమైన సంబంధాలు ఉన్నాయి.ఈ ఇరు కుటుంబాల్లో మూడోతరం హీరోలైన యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌,మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ల మధ్య మంచి రిలేషన్‌ షిపే ఉంది.

అయితే ఈమధ్య కాలంలో రాంచరణ్‌  కొణిదల ప్రొడక్షన్స్‌ పేరుతో  సొంత బ్యానర్‌ను స్టార్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీనెం.150 తన బ్యానర్‌లో తెరకెక్కించి మంచి కలెక్షన్లు సాధించాడు. అంతేకాకుండా తన తండ్రి 150వ చిత్రం తన బ్యానర్‌ తెరకెక్కించి మంచి వసూల్‌ రాబట్టినందుకు హ్యాపిగా కూడా ఉన్నడట రాంచరణ్‌. అయితే ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ లో బయటి హీరోస్ తో కూడా సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో వున్నాడట. ఆల్రెడీ శర్వానంద్, అఖిల్‌తో సినిమాలు  చేయటానికి నిర్ణయించుకున్నాడట చెర్రీ.
Jr.NTR New Movie in Konidela Productions Banner
కానీ ఆ తర్వాత సినిమా మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలనే ఆలోచనతో వున్నాడట మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌. ఎన్టీఆర్‌తో చేయటానికి మంచి కథా దొరికితే తాను సినిమా చేయాడానికి రెడీ అని రాంచరణ్‌ ప్రకటించాడట. చెర్రీతో వున్న స్నేహం కారణంగా ఎన్టీఆర్ కూడా సినిమా ఒప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు మెగాఅభిమానులు.